18 సంవత్సరాలు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్..!

IMA urges PM Modi to open Corona vaccination for everyone above 18.ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ భారత ప్ర‌ధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. 18 ఏళ్ల వ‌య‌సు దాటిన వారికి కూడా కోవిడ్ టీకా ఇచ్చే విధంగా అనుమ‌తి ఇవ్వాల‌ని ఐఎంఏ త‌న లేఖ‌లో కోరింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 7:30 AM GMT
corona vaccination

భారతదేశంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ భారత ప్ర‌ధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. కోవిడ్‌19 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని, 18 ఏళ్ల వ‌య‌సు దాటిన వారికి కూడా కోవిడ్ టీకా ఇచ్చే విధంగా అనుమ‌తి ఇవ్వాల‌ని ఐఎంఏ త‌న లేఖ‌లో కోరింది. వాక్ ఇన్ కోవిడ్ టీకాలు అందుబాటులో ఉండాల‌ని.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా టీకాలు ఇవ్వాల‌ని ఐఎంఏ త‌న లేఖ‌లో పేర్కొంది. దేశంలో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంద‌ని, అందుకే యుద్ధ ప్రాతిప‌దిక‌ను టీకాలు ఇవ్వాల‌ని కోరింది. 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఐఎంఏ సూచ‌న చేసింది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లోకి వెళ్లాలంటే వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేట్ల‌ను త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని కోరారు. వైర‌స్ కేసులు అధికంగా ఉన్న నేప‌థ్యంలో నిత్యావ‌స‌రం కాన‌టువంటి సినిమాలు, సాంస్కృతి, మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు, క్రీడ‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఐఎంఏ త‌న లేఖ‌లో కోరింది.

కరోనా మహమ్మారి పెరిగిపోతూ ఉండడంతో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అధ్యక్షతన సమీక్ష నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌లో రోజువారీ కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో రికార్డయిన కేసుల్లో 80శాతానికిపైగా కేసులు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, పంజాబ్‌ల్లోనే 75.88శాతం యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే 58.23శాతం ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.


Next Story