ప్రమాదంలో 25 కోట్ల జనాభా.. సంచలన విషయాలు వెల్లడించిన ఖరగ్‌పూర్‌ ఐఐటీ

IIT Kharagpur Study Finds 20% of India Has High Arsenic Levels in Groundwater. ఖరగ్‌పూర్‌ ఐఐటీ కీలక విషయం వెల్లడించింది.

By Medi Samrat
Published on : 12 Feb 2021 5:38 PM IST

IIT Kharagpur Study  about groundwater

ఖరగ్‌పూర్‌ ఐఐటీ కీలక విషయం వెల్లడించింది. భారత్‌లో 20 శాతం భూగర్భ జలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్‌ ఉన్నట్లు వెల్లడించింది. 25 కోట్ల జనాభా ఈ నీటిని వాడుతున్నట్లు అధ్యయనంలో తేల్చింది. కృతిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఇటీవల సైన్స్‌ ఆఫ్‌ ద టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌ జర్నల్‌లో ఈ పరిశోధన పత్రాలు ప్రచురితం అయ్యాయి.

పరిశోధకులు వెల్లడించిన వివరాల మేరకు.. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా పరిశీలిస్తే దేశమంతా ప్రమాదకరమైన ఆర్సెన్సిక్‌ స్థాయిలు ఉన్నట్లు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఆర్సెనిక్‌ అధిక ప్రాంతాల్లో ఉందని వెల్లడించింది. పంజాబ్‌లో 92 శాతం, బీహార్‌ 70 శాతం, హర్యానా 43 శాతం, పశ్చిమబెంగాల్‌ 69 శాతం, అసోం 48 శాతం, ఉత్తరప్రదేశ్ 28 శాతం, గుజరాత్‌ 24 శాతం రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ఆర్సెనిక్‌ ఉన్నట్లు గమనించామని తెలిపారు.

భారత్‌లో 250 మిలియన్లకు పైగా ప్రజలు ఆర్సెనిక్‌ను ఎక్కువ శాతం తీసుకుంటున్నట్లు ఖరగ్‌పూర్‌ ఐఐటీ అసోసియేషన్‌ ప్రొఫెసర్‌ అభిజిత్‌ ముఖర్జీ తెలిపారు. దేశంలో లీటర్‌కు 10 మైక్రోగ్రాములు ఆర్సెనిక్‌ ఉండాలని నిబంధనలు వెల్లడిస్తున్నాయి. కానీ అంతకంటే ఎక్కువ ఆర్సెనిక్‌ ఉన్నట్లు పరిశోధకులు నివేదిక ద్వారా తేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా భూగర్భ జలాల నుంచి లభిస్తుందని ఆయన అన్నారు. గతంలో చేసిన పరిశోధనలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయని పరిశోధకులు వెల్లడించారు. తమ అధ్యయనం ద్వారా ప్రజలు సురక్షితమైన తాగునీరు అందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అయితే ఆర్సెనిక్‌ ద్వారా క్యాన్సర్‌, ఇతర వ్యాధులు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.




Next Story