మాజీ ముఖ్యమంత్రి నోట్లోకి కరోనా వైరస్ ను వేస్తానని అంటున్న ఎమ్మెల్యే..!
If I get a hand on coronavirus, would put it in Devendra Fadnavis's mouth. శివసేన ఎమ్మెల్యే.. తనకు కరోనా వైరస్ దొరికితే మాజీ ముఖ్యమంత్రి నోట్లోకి వేస్తాడట.
By Medi Samrat Published on 18 April 2021 3:41 PM IST
కరోనా వైరస్ అత్యధికంగా ఉన్న ప్రాంతం మహారాష్ట్ర అనే చెబుతూ ఉన్నారు. భారతదేశంలో కరోనా మహమ్మారి ఉధృతికి కారణం మహారాష్ట్ర నుండి ఇతర ప్రాంతాలకు పాకిన వైరస్ అనే అంటున్నారు కొందరు. మరోవైపు మహారాష్ట్రలో పలు పార్టీలు శివసేనను తప్పుబడుతూ ఉన్నాయి. శివసేన ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకోకపోవడం వలనే కరోనా ఉధృతి కొనసాగుతూ ఉందని అంటున్నారు. ఈ విమర్శలకు హర్ట్ అయిన ఓ శివసేన ఎమ్మెల్యే.. తనకు కరోనా వైరస్ దొరకాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ కరోనా వైరస్ ఆయనకు దొరికితే ఏమి చేస్తాడో తెలుసా..? మాజీ ముఖ్యమంత్రి నోట్లోకి వేస్తాడట..!
తనకు కరోనా వైరస్ దొరికితే దాన్ని తీసుకెళ్లి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నోటిలో వేసేవాడినని శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలమైందని ఫడ్నవీస్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో శివసేన నేత సంజయ్ గైక్వాడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆక్సిజన్ సిలిండర్లు పంపాలన్న తన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించలేదని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఉద్ధవ్ రాజకీయాలను పక్కన పెట్టాలని బీజేపీ నాయకులు కోరారు. ఉద్ధవ్ తో మాట్లాడేందుకు ప్రధాని ప్రయత్నించినా.. ఆయనే తిరస్కరించారని బీజేపీ నేతలు చెబుతూ ఉన్నారు. కరోనా ఉద్ధృతంగా ఉన్న మహారాష్ట్రకు చాలినంత ఆక్సిజన్ ను సరఫరా చేస్తామంటూ ఉద్ధవ్ కు ప్రధాని హామీ ఇచ్చారని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. 1,121 వెంటిలేటర్లు కూడా పంపిస్తామని చెప్పారన్నారు. మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రేపై నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం అందరితోనూ సంప్రదింపులు జరుపుతోందన్నారు. ప్రస్తుతం దేశంలో సామర్థ్యానికి మించి 110 శాతం ఆక్సిజన్ ఉత్పత్తవుతోందన్నారు.