Pahalgam: ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ ఆఫీసర్ మృతి.. విశాఖ వాసి గల్లంతు
జమ్మూ కశ్‌మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం, ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన జరిగిన ఉగ్రదాడిలో హైదరాబారద్ వాసి మనీశ్ రంజన్ మృతి చెందారు.
By అంజి
Pahalgam: హైదరాబాద్ ఐబీ ఆఫీసర్ మృతి.. విశాఖ వాసి గల్లంతు
జమ్మూ కశ్‌మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం, ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన జరిగిన ఉగ్రదాడిలో హైదరాబారద్ వాసి మనీశ్ రంజన్ మృతి చెందారు. ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పహల్గామ్ పర్యటనకు వెళ్లగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భార్య, పిల్లలను తనకు ఎదురుగా పరిగెత్తమని చెప్పారు. ఇంతలోనే బుల్లెట్లు తగిలి మనీశ్ ప్రాణాలు వదిలాడు. భార్య పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.
ఇదిలా ఉంటే.. ఉగ్రదాడి ఘటనలో విశాఖ వాసి గల్లంతైనట్టు సమాచారం. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ఇటీవల అక్కడికి టూర్‌కు వెళ్లారు. అయితే దాడి తర్వాత ఆయనకు బంధువులు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దీంతో చంద్రమౌళి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉగ్రవాద దాడిలో కనీసం 26 మంది పర్యాటకులు మరణించినట్లు సమాచారం. వారిలో హర్యానాకు చెందిన నావికాదళ అధికారి, కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్ రావు అనే రియల్టర్, మహారాష్ట్రకు చెందిన దిలీప్ డిస్లే, అతుల్ మోన్ అనే ఇద్దరు పర్యాటకులు, ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ సత్పతి తదితరులు ఉన్నారు. ఈ ఉగ్రవాద దాడిలో అనేక మంది గాయపడినట్లు సమాచారం.
ఉగ్రవాద దాడిపై ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, దాడిని ఖండించారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి పిరికి దాడులు భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయబోవని ఆయన X లో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వారిపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.