యుద్ధ భూమి ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని హిందాన్ ఎయిర్ బేస్ నుండి నిన్న బయలుదేరిన ఐఏఎఫ్ యొక్క మూడు సీ-17 హెవీ లిఫ్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఈ ఉదయం హిందాన్‌కు తిరిగి దిగాయి. ఈ విమానాలు ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, స్లోవేకియా, పోలాండ్ నుండి 629 మంది భారతీయులను తరలించాయి. ఈ విమానాలు భారతదేశం నుండి ఆయా దేశాలకు 16.5 టన్నుల రిలీఫ్ లోడ్‌ను కూడా తీసుకువెళ్లాయి. ఇప్పటివరకు.. ఐఏఎఫ్ 2,056 మంది భారత ప్రయాణికులను తిరిగి తీసుకురావడానికి 10 విమానాలను నడిపింది. అయితే ఆపరేషన్ గంగాలో భాగంగా ఈ దేశాలకు 26 టన్నుల రిలీఫ్ లోడ్‌ను తీసుకువెళ్లింది.
ఉక్రెయిన్ నుండి అనేక మంది భారతీయ విద్యార్థులు.. భారత ప్రభుత్వం సహాయంతో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్తున్నారు. పోలాండ్, రొమేనియా, హంగేరీ నుండి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి భారతదేశం సీ-17లు, వాణిజ్య విమానాలను మాత్రమే నడిపింది. "ఆపరేషన్ గంగా" అనేది ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. భారతదేశం ప్రస్తుతం తూర్పు యూరోపియన్ దేశం యొక్క పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలాండ్, స్లోవేకియాకు భూ మార్గాల ద్వారా భారతీయులను తరలిస్తున్నారు. అక్కడి నుండి స్వదేశానికి తీసుకువస్తున్నారు.