పాకిస్థాన్ జెట్ల కూల్చివేతపై IAF చీఫ్ సంచలన ప్రకటన
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ సంచలన ప్రకటన చేశారు.
By - Knakam Karthik |
పాకిస్థాన్ జెట్ల కూల్చివేతపై IAF చీఫ్ సంచలన ప్రకటన
ఢిల్లీ: భారత వాయుసేన (IAF) ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పి. సింగ్ శుక్రవారం ఒక కీలక ప్రకటన చేశారు. గత మే నెలలో చోటుచేసుకున్న సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో, భారత వాయుసేన ఐదు పాకిస్థాన్ యుద్ధవిమానాలను ధ్వంసం చేసిందని ఆయన వెల్లడించారు. వీటిలో అమెరికా తయారు చేసిన F-16లు మరియు చైనా తయారీ JF-17 థండర్ విమానాలు ఉన్నాయని ఆయన వివరించారు.
93వ ఎయిర్‌ఫోర్స్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పి. సింగ్ మాట్లాడుతూ..“పాకిస్థాన్ ప్రాచుర్యం చేస్తున్నట్టుగా భారత యుద్ధవిమానాలు కూల్చబడినట్టయితే, దానికి తగిన ఆధారాలు వారు చూపలేకపోయారు. ఇది కేవలం వారి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రొపగాండా మాత్రమే,” అని స్పష్టం చేశారు.
యుద్ధ విమానాల వివరాలు
సింగ్ వెల్లడించిన ప్రకారం, మేలో జరిగిన సరిహద్దు గగనతల సంఘర్షణలో .3 JF-17 థండర్ జెట్లు, 2 F-16 ఫైటర్ జెట్లను.. భారత వైమానిక దళం రణరంగంలో కూల్చివేసింది అని ఏపీ సింగ్ ప్రకటించారు. భారత వాయుసేన ఎల్లప్పుడూ శత్రు దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, ఆధునిక టెక్నాలజీ, సాంకేతిక నైపుణ్యం కలగలిపి దేశ గగనతలాన్ని కాపాడుతుందని చెప్పారు.