హర్యానా రాష్ట్రం కర్నాల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ ఫ్యామిలీ రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. వివరాల్లోకి వెళితే.. కర్నాల్‌లోని షేక్‌పురా సుహానా గ్రామానికి చెందిన విక్రమ్ అనే వ్యక్తి కామన్ సర్వీస్ సెంటర్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య ఆ గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. అయితే క్రికెట్‌పై ఇంట్రెస్ట్ ఉన్న విక్రమ్ ఏప్రిల్ 1వ తేదీన లక్నో, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో రూ.49 పెట్టి మై11 సర్కిల్‌లో ఫాంటసీ గేమ్ ఆడినట్లు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తనకు తొలిస్థానంలో రాగా, రూ.3 కోట్లు, ఒక మహీంద్రా థార్ ఎస్‌యూవీ గెలిచినట్లు చెప్పాడు. దీంతో విక్రమ్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ.. ఇంతకుముందు ఆన్‌లైన్ గేమ్స్ ఇడి చిన్న మొత్తాలను గెలుచుకున్నా. నేను 2019 నుంచి ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నా. 2021వ సంవత్సరంలో రూ.2.70 లక్షలు గెలుచుకున్నా..అని చెప్పాడు. ఇదే క్రమంలో యువత కూడా ఆన్‌లైన్ గేమ్‌ల కోసం ఎక్కువగా ఖర్చు చేయొద్దు అని, దానికి బానిస కావొద్దు అని విక్రమ్ సలహా ఇచ్చాడు.