నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం

Huge Fire Accident In Noida. యూపీలోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్‌ 63 సమీపంలో మురికి వాడల్లో భారీ మంటలు.

By Medi Samrat
Published on : 12 April 2021 8:22 AM IST

Fire Accident In Noida

యూపీలోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్‌ 63 సమీపంలో మురికి వాడల్లో భారీ మంటలు చెలరేగడంతో ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 150కి పైగా గుడిసెలు దగ్దమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో బహ్లోల్‌పూర్‌‌ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఒంటిగంట ప్రాంతం లో నిప్పు అంటుకున్నట్టుగా ప్రాధమిక సమాచారం.


ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఘటనకు సంబంధించిన వీడియోను నోయిడా గౌతమ్‌ బుద్ద నగర్‌ పోలిస్‌ కమిషనర్‌ ట్విటర్‌లో షేర్ చేశారు. నోయిడా పోలిస్‌ స్టేషన్‌ ఏరియా 3 పరిధిలో బహ్లోల్‌పూర్‌ గ్రామంలో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు ఆర్పడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు అని పోస్టు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పలు సహాయక బృందాలు బాధితులకు ఆహారాన్ని అందజేస్తున్నాయి. సంఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యానాధ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.



Next Story