బెంగళూరులో ఘోరం..ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడిన పాప (video)

బెంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 9 April 2026 1:30 PM IST

Karnataka News, Bengaluru, Tragedy, CCTVFootage, ChildSafety, Accident, ToddlerFall

బెంగళూరులో ఘోరం, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడిన పాప (video)

బెంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒక ఏడాదిన్నర చిన్నారి ఆడుకుంటూ మొదటి అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కింద పడిపోగా, ఆ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఆడుకుంటున్న పాప, ఎవరూ గమనించని సమయంలో మెయిన్ డోర్ దాటి బాల్కనీ లేదా మెట్ల మార్గం వద్దకు వచ్చింది. అక్కడ ఒక్కసారిగా పట్టుతప్పి నేరుగా కింద ఉన్న తారు రోడ్డుపై పడిపోయింది.

ఈ ప్రమాదంలో చిన్నారి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పాప పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కళ్లెదుటే బిడ్డ అంత ఎత్తు నుంచి పడిపోవడం చూసిన తల్లి తీవ్ర దిగ్భ్రాంతికి లోనై అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. మానసిక వేదనతో ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ప్రస్తుతం ఆమెను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పసిబిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Next Story