Video: హిందీ భారతదేశ జాతీయ భాష కాదు: క్రికెటర్ అశ్విన్
స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. ఓ ప్రైవేట్ కాలేజీ ఈవెంట్‌లో మాట్లాడుతూ, తన కెరీర్, భారతదేశంలో హిందీ స్థితి రెండింటిపై తన వ్యాఖ్యలతో ముఖ్యాంశాల్లో నిలిచాడు.
By అంజి Published on 10 Jan 2025 11:14 AM ISTహిందీ భారతదేశ జాతీయ భాష కాదు: క్రికెటర్ అశ్విన్
స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. ఓ ప్రైవేట్ కాలేజీ ఈవెంట్‌లో మాట్లాడుతూ, తన కెరీర్, భారతదేశంలో హిందీ స్థితి రెండింటిపై తన వ్యాఖ్యలతో ముఖ్యాంశాల్లో నిలిచాడు. కళాశాల స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి అశ్విన్ మాట్లాడుతూ.. హిందీ భారతదేశ జాతీయ భాష కాదని అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి అశ్విన్ ప్రసంగిస్తూ ఇంగ్లీష్, తమిళం లేదా హిందీలో ఏ భాషలో ప్రసంగం వినాలనుకుంటున్నారని విద్యార్థులను అడిగారు. విద్యార్థులను హిందీ గురించి అడగ్గా అందరూ సైలెంట్ అయిపోయారు..అప్పుడు అశ్విన్ హిందీ భారత జాతీయ భాష కాదన్నారు.
తన ప్రసంగం ప్రారంభంలో.. అశ్విన్ మొదట ఇంగ్లీష్‌లో ఎవరు వినాలనుకుంటున్నారు అని అడిగారు, దీనికి విద్యార్థుల నుండి తేలికపాటి స్పందన వచ్చింది. అయితే అతను తమిళం గురించి అడగడంతో, విద్యార్థులు గొంతును పెంచారు. మూడవది అశ్విన్ హిందీ గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు, కొంత సమయం తర్వాత ఒకరిద్దరు వాయిస్ వచ్చినప్పటికీ, పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. అప్పుడు అశ్విన్.. "నేను ఇలా చెప్పాలని అనుకున్నాను: హిందీ మన జాతీయ భాష కాదు; ఇది అధికారిక భాష" అని అన్నారు. అశ్విన్ చేసిన ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ రావడం మొదలయ్యాయి, కొందరు దానికి మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా ఉన్నారు. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.
#Watch | தமிழுக்கு அதிர்ந்த அரங்கம்.. இந்திக்கு SILENT.. "இந்தி தேசிய மொழி இல்ல".. பதிவு செய்த அஸ்வின்!சென்னையில் உள்ள தனியார் பொறியியல் கல்லூரியில் நடைபெற்ற பட்டமளிப்பு விழாவில் மாஸ் காட்டிய கிரிக்கெட் வீரர் அஸ்வின்#SunNews | #Chennai | #Ashwin | @ashwinravi99 pic.twitter.com/TeWPzWAExQ
— Sun News (@sunnewstamil) January 9, 2025