మేం వ‌ర‌ద‌ల‌ను గుండె ధైర్యంతో ఎదుర్కొంటాం.. కేజ్రీవాల్‌కు అస్సాం సీఎం కౌంట‌ర్‌

Himanta slams Kejriwal's remarks on Delhi floods. యమునా నది వరదలపై బీజేపీ, ఢిల్లీ ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

By Medi Samrat  Published on  16 July 2023 3:27 PM GMT
మేం వ‌ర‌ద‌ల‌ను గుండె ధైర్యంతో ఎదుర్కొంటాం.. కేజ్రీవాల్‌కు అస్సాం సీఎం కౌంట‌ర్‌

యమునా నది వరదలపై బీజేపీ, ఢిల్లీ ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విష‌య‌మై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ.. ప్రకృతి భౌగోళికతను గుర్తించదని, వరదలకు తమ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిందిస్తోందని విమర్శించారు. ప్రతి సంవత్సరం అస్సాంకు భూటాన్, అరుణాచల్, చైనా నుండి వ‌ర‌దల‌ తాకిడి ఉంటుంద‌ని.. మేము గుండె ధైర్యంతో వరదలను ఎదుర్కొంటామ‌ని.. మానవుల ఊహకు అందని బాధను, బాధలను అనుభవిస్తాం, అయినా ఇతరులను నిందించం. ఎందుకంటే ప్రకృతి ఓ ప్ర‌దేశాన్ని గుర్తించి ఇలాంటి ప‌రిస్థితుల‌ను క‌ల్పించ‌ద‌ని మాకు తెలుసు అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఢిల్లీలో సంభవించిన వరదలు ప్రకృతి వైపరీత్యాల వల్ల కాదని, బీజేపీ ప్రణాళికాబద్ధంగా అమలు చేసిన సంక్షోభమని ఆప్ శనివారం పేర్కొంది. ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. హర్యానాలోని హత్నీ కుండ్ బ్యారేజీ నుంచి ఉద్దేశ్యపూర్వకంగా ఢిల్లీని ముంచేందుకే యమునా నదిలోకి వదులుతున్నారని అన్నారు. హర్యానా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఢిల్లీలోని ఐటీఓ బ్యారేజీ గేట్లు సిల్ట్ పేరుకుపోవడంతో జామ్ అయ్యాయని ఆప్ పేర్కొంది. మరింత సమర్థవంతమైన నిర్వహణ కోసం ఆ బాధ్యతను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆప్ ఆరోపణలపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం స్పందిస్తూ.. ఈ "బ్లేమ్ గేమ్" మానవాళికి లేదా రాష్ట్రానికి లేదా దేశానికి ప్రయోజనం కలిగించదని అన్నారు.


Next Story