హిమాచల్‌ప్రదేశ్‌ను ముంచెత్తుతున్న భారీ వరదలు

హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  26 Jun 2023 11:09 AM IST
Himachal Pradesh, Heavy Rains, Floods

హిమాచల్‌ ప్రదేశ్‌ను ముంచెత్తుతున్న భారీ వరదలు

హిమాచల్‌ ప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా.. మండి జిల్లాలోని బాగిపుల్‌ ప్రాంతంలో వరదలు అతలాకుతలం చేశాయి. పర్యాటకులు, స్థానికులతో పాటు మొత్తం 200 మంది పైగా ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. ప్రశార్‌ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయి. దీంతో.. వరద తీవ్రత ఎక్కువగా ఉండి జనాలు చిక్కుకుపోయారని తెలిపారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా బాగిపుల్‌ ప్రాంతంలోని ప్రశాస్‌ సరస్సు దగ్గర వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పర్యాటకులతో పాటు.. 200 మందికి పైగా ప్రజలు మండి ప్రషార్‌ రోడ్‌లోని బగ్గీ వంతెన దగ్గర చిక్కుకుపోయారు. చంబా నుంచి వచ్చిన విద్యార్థుల బస్సు పరాశర్‌ నుంచి తిరిగి వస్తున్న అనేక వాహనాలు వరదల్లో ఇరుక్కుపోయాయి. వరదల్లో ఇరుక్కున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను అలర్ట్‌ చేశామని చెప్పారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని పండో-మండి జాతీయ రమదారిలో ఛార్మిలే నుంచి సత్మిలే మధ్య చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో.. రహదరాని అధికారులు మూసేసినట్లు ప్రకటించారు. ఎవరూ ఆ దారిలో వెళ్లి ఇబ్బందులు పడొద్దని ముందుగానే సూచించారు.

మరోవైపు ఊహించని వరదతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. పంచకులలో ఓ కారు నీటి వరదలో కొట్టుకుపోయింది. దాంట్లో ఓ మహిళ ఉండగా.. స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. కాగా హిమాచల్‌ ప్రదేశ్‌లో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో.. ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేశారు.

Next Story