ఆరు సార్లు సీఎంగా ప‌నిచేసిన నేత ఇక‌లేరు

Himachal EX CM Virbhadra Singh Passes Away.కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2021 8:01 AM IST
ఆరు సార్లు సీఎంగా ప‌నిచేసిన నేత ఇక‌లేరు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ క‌న్నుమూశారు. దీర్ఘ‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గత కొంత కాలంగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం తెల్ల‌వారుజామున ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 87 సంవ‌త్స‌రాలు.

ఆస్ప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ జ‌న‌క్ రాజ్ మాట్లాడుతూ.. వీర‌భ‌ద్ర‌సింగ్‌కు గ‌త కొంత‌కాలంగా ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఏప్రిల్ 13న ఆయ‌న క‌రోనాకు గుర‌య్యార‌న్నారు. అనంత‌రం మోహాలీలోని మ్యాక్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. 1934 జూన్ 23న సిమ్లాలోని రాజ కుటుంబంలో వీర్‌భద్ర సింగ్ జ‌న్మించారు. అందుకే జనమంతా రాజా సాహిబ్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. వీర‌భ‌ద్ర‌సింగ్ తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా అదేవిధంగా ఆరుసార్లు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎంగా ప‌నిచేశారు. 1976 ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో ఆయన ప్రతినిధిగా వ్యవహరించారు. అంతేకాదు కేంద్ర కేబినెట్‌లోనూ పలు కీలక పదవులు అధిరోహించారు. ఆయన సతీమణి ప్రతిభా సింగ్‌ మండి నియోజకవర్గం నుంచి లోక్‌ సభ సభ్యురాలిగా పని చేశారు.

Next Story