క్షణాల్లో ఈ - ఓటర్ ఐడీని పొందండిలా
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ-ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈసీఐ వెసులుబాటు కల్పించింది.
By అంజి Published on 17 Oct 2023 10:04 AM ISTక్షణాల్లో ఈ - ఓటర్ ఐడీని పొందండిలా
త్వరలోనే ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ-ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈసీఐ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ఎన్నికల సంఘం వెబ్‌సైట్ కీలక మార్పులు చేసింది. ఈసీఐ https://voters.eci.gov.in వెబ్‌సైట్ నుంచి ఓటర్లు మొబైల్ నంబర్ నమోదుతో క్షణాల్లో ఈ - ఓటరు గుర్తింపుకార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ కార్డుతో ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఓటరు లిస్ట్‌లో మార్పులు, చేర్పుల కోసం రూపొందించిన ఫాం -8ను ఉపయోగించాలని ఎన్నికల సంఘం తెలిపింది.
అందులో మొబైల్ నంబర్ నమోదుకు స్పెషల్ కాలమ్ అందుబాటులో ఉందని పేర్కొంది. దరఖాస్తును సబ్మిట్ చేసి, వెబ్‌సైట్‌లోని ఈ-ఎపిక్ విభాగంలో ఓటర్ ఐడీ నెంబర్‌ని నమోదు చేయాలి. ఆ వెంటనే ఏ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితో ఈ-ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. అన్ని సర్టిఫికెట్ల మాదిరిగానే ఇది కూడా చెల్లుబాటు అవుతుంది. దీని ద్వారా ఎన్నికల సంఘం పంపే ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. గతంలో కూడా ఈ సదుపాయం ఉన్నప్పటికీ, అది ఆమోదం పొందేందుకు ఎక్కువ టైం పట్టేది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను ఇప్పుడు సరళతరం చేసింది.