తెలంగాణ గవర్నర్‌గా రజనీకాంత్.. క్లారిటీ ఇదే?
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు త్వరలోనే రాజ్యంగబద్ధ పదవి దక్కబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని సమాచారం
By అంజి Published on 6 Sept 2023 11:00 AM ISTతెలంగాణ గవర్నర్‌గా రజనీకాంత్.. క్లారిటీ ఇదే?
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు త్వరలోనే రాజ్యంగబద్ధ పదవి దక్కబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తాజా పుకార్ల ప్రకారం.. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇది నిజమని చెప్పడానికి ఎలాంటి ధృవీకరణ లేదు. ఇప్పటి వరకు నేరుగా బీజేపీ గవర్నర్ పదవి ఇస్తానని చెప్పలేదు.. అదే సమయంలో రజనీకాంత్ కూడా ఇస్తే తీసుకుంటానని నేరుగా చెప్పలేదు. కానీ నడవాల్సిన ఊహాగానాలు నడుస్తున్నాయి. పుకార్ల ప్రకారం.. త్వరలో చిత్ర పరిశ్రమ నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్న రజనీకాంత్‌కు బిజెపి జాతీయ నాయకత్వం ఈ బంపర్ ఆఫర్‌ను అందించినట్లు సమాచారం.
తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా భారీ మైలేజ్ వచ్చేలా తమిళ సూపర్ స్టార్ దోహదపడతారని బీజేపీ అధినాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు, తమిళనాడులో కూడా పార్టీకి కొంత ప్రాబల్యం దక్కుతుంది. "వాస్తవానికి, రజనీకాంత్‌ను గవర్నర్ పదవితో గౌరవించడం ద్వారా, మొత్తం దక్షిణ భారతదేశంలోని ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలని బిజెపి భావిస్తోంది" అని వర్గాలు తెలిపాయి. సూపర్ స్టార్ త్వరలో భారతదేశంలోని ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతాడని కొన్ని రోజుల క్రితం పుకార్లను ప్రేరేపించారు రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్.
దీంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలకు మసాలా జోడించారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవచ్చు, కానీ కచ్చితంగా రాష్ట్రానికి గవర్నర్ అవుతారని సత్యనారాయణరావు అన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో రజనీకాంత్ భేటీ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి మరింత దగ్గరవుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్టార్ ఆదిత్యనాథ్ పాదాలను కూడా తాకారు. తమ రాబోయే ఎన్నికల ప్రచారానికి దక్షిణాదిన సినీ తారలను ఆకర్షించడంపై బిజెపి దృష్టి సారించింది. కాబట్టి రజనీకాంత్‌ను మోడీ ప్రభుత్వం ఎప్పుడైనా గవర్నర్‌గా చేసినా ఆశ్చర్యం లేదు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.