ఈ ఆలయాల గురించి ఎప్పుడైనా విన్నారా?
భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల స్మారకంగా ఈ ఆలయాన్ని 1936లో నిర్మించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో
By అంజి Published on 16 Jun 2023 7:00 AM GMTఈ ఆలయాల గురించి ఎప్పుడైనా విన్నారా?
భరతమాత ఆలయం: భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల స్మారకంగా ఈ ఆలయాన్ని 1936లో నిర్మించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న మహాత్మా గాంధీ విద్యాపీఠ్‌లో ఉందీ ఆలయం. వివిధ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆలయాలు వెలిశాయి.
బుల్లెట్ బాబా మందిర్: రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఓం సింగ్ రాథోడ్ బుల్లెట్‌పై వెళ్తూ ఓ చోట ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఆయన బుల్లెట్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తే.. మాయమై ప్రమాదం జరిగిన చోటుకి వచ్చేసిందట. అక్కడే బుల్లెట్‌కు పూజలు చేస్తున్నారు.
ఏరోప్లేన్ గురుద్వారా: విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లు ఈ గురుద్వారాలో ఏరోప్లేన్ బొమ్మను కానుకగా ఇస్తే.. వారికి అన్ని అడ్డంకులు తొలగిపోతాయట. వీసా ఇబ్బందులేవి రావట. పంజాబ్‌లోని జలంధర్‌లో ఈ గురుద్వారా ఉంది.
హిడింబా దేవి ఆలయం: పంచ పాండవుల్లో ఒకరైన భీముడి భార్య హిడింబా. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో హిడింబా ఏళ్ల తరబడి తపస్సు చేసి దేవతగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. 1553లో అప్పటి మహారాజు బహదూర్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించారు.
మలనాడ ధ్యుర్యోధన ఆలయం: కేరళలోని కొల్లాంలో కౌరవుల్లో అగ్రజుడైన ధుర్యోధనుడికి ఓ ఆలయం ఉంది. పాండవులను వెతుక్కుంటూ ధుర్యోధనుడు ఈ ప్రాంతానికి వచ్చాడట. ఆయన కూర్చున్న చోటనే ఆలయాన్ని నిర్మించారు.
చైనీస్ కాళీ: కలకత్తాలోని టాంగ్రాలో ఉందీ ఆలయం. ఇక్కడి కాళీ మాతకు భక్తులు చైనీస్ వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
చన్నపట్న డాగ్ టెంపుల్: శునకాల్ని కాలభైరవుడి రూపంలో పూజిస్తుంటాం. కర్ణాటకలోని ఆగ్రహార వలెగెరెహల్లిలో ఓ వ్యాపారవేత్త కెంపన్న దేవత కోసం ఆలయం నిర్మిస్తుండగా రెండు శునకాలు మాయమయ్యాయి. దీంతో వాటి విగ్రహాలను ఆలయంలో ఏర్పాటు చేశారు.
కర్ణిమాత దేవాలయం: రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఉన్న ఈ ఆలయంలో దాదాపు 25 వేల ఎలుకలు తిరుగుతుంటాయి. పాలు, ఫలహారాలు ఇస్తుంటారు. ఎలుకలు వాటిని తింటే తాము అదృష్టవంతులమని భక్తులు భావిస్తారు.