ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు
Heavy rains lashed in mumbai.ముంబై మహానగరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈ రోజు ఉదయం నుంచి
By తోట వంశీ కుమార్
ముంబై మహానగరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈ రోజు ఉదయం నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 10 నాటికి రుతుపవనాలు ముంబైకి చేరుకునేవని, అయితే ఈసారి ఒకరోజు కంటే ముందే ప్రవేశించాయని ముంబై డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డిడిజి) డాక్టర్ జయంతా సర్కార్ చెప్పారు.
జూన్ 9 నుంచి జూన్ 12 వరకు ముంబై, థానే, రాయ్‌గడ్, కొంకణ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబైలోని వివిధ ప్రాంతాలు మరియు దాని శివారు ప్రాంతాలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నందున బృహన్ ముంబై కార్పొరేషన్ (బిఎంసి) రుతుపవనాల సన్నద్ధతపై అత్యవసర సమావేశం నిర్వహించింది.
ఇదిలా ఉంటే.. నగరంలోని పలు ప్రాంతాలను భారీవాన ముంచెత్తుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. దీంతో లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరో ఐదు రోజుల పాటు ముంబైకి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో కొంకణ్ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. థానే, రాయ్‌గఢ్, పుణె, బీడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.