ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. వేడిగాలులకు అవకాశం లేదు

దేశవ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటనలో తెలిపింది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 2 May 2023 3:00 PM IST

Heavy rainfall , India , heatwave , India Meteorological Department

ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. వేడిగాలులకు అవకాశం లేదు

దేశవ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటనలో తెలిపింది. వచ్చే ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎలాంటి వేడి గాలులు ఉండవని, సాధారణ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు ప్రాంతాలలో వచ్చే ఐదే రోజుల పాటు భారీ నుంచి, అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో వారం పాటు భారీ వర్షాలు ఉంటాయని, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశాలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగులు పడొచ్చని హెచ్చరించింది. మధ్య భారత్ లోని చాలా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశం ఉంది. వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల ఈ అకాల వర్షాలు వచ్చినట్టు ఐఎండీ వివరించింది. హర్యానా, పరిసర ప్రాంతాల్లో దిగువ నుంచి ఎగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయులపై సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. మరో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కూడా దక్షిణ పాకిస్థాన్ మధ్య ట్రోపోస్ఫెరిక్ స్థాయుల్లో కేంద్రీకృతమై ఉంది.

Next Story