కాంగ్రెస్‌కు సీనియర్ నేత షాకిచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు తన శాసన సభ సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు
సోమవారం సంచలన ప్రకటన చేశారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని గత నెల ప్రకటించారు. అలాగే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
అయితే.. కృష్ణారావు కొన్ని రోజులుగా అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అధికార నివాసాన్ని, కేటాయించిన కారును కూడా వినియోగించడం లేదు. అలాగే.. గత నెల 14న మంత్రి పదవికి మల్లాది రాజీనామా చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే సీఎం నారాయణ్‌స్వామీ మాత్రం అలాంటిదేమి లేదంటూ ఖండించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా శాసన సభ సభ్యత్వానికి. మంత్రి పదవికి మల్లాడి రాజీనామా చేశారు.