ఓవైపు రైతుల ఆందోళన.. మరోవైపు లాక్ డౌన్ పొడిగింపు..
Haryana Lockdown Extended By A Week.హర్యానాలో నేటితో ముగియనున్న లాక్ డౌన్ ను మే 24 వరకు కొనసాగించునుంది.
By Medi Samrat
అటు కరోనా.. ఇటు రైతుల ఆందోళనలు హర్యానా రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. హర్యానాలోని హన్సిలో ఒక కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు వెళ్లిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను రైతులు ఘెరావ్ చేశారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ ఆయన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నించారు. దీంతో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆగ్రహం తో ఉగిపోయిన రైతులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను లాగిపారేశారు. ఒక్కానొక సమయంలో పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించి రైతులను చదరగొట్టారు. కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపిస్తుండటం తో రైతులు ఆందోళనలు విరమించాలని రైతులకు ముఖ్యమంత్రి గతంలో విజ్ఞప్తి చేసినప్పటికి రైతులు తమ దారి మార్చుకోలేదు.
మరోవైపు రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి హర్యానా ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను పొడిగించింది. నేటితో ముగియనున్న లాక్ డౌన్ ను మే 24 వరకు కొనసాగించునుంది. అయితే నిత్యావసర సరుకులు, మందులు, రవాణా వాహనాలకు మినహాయింపు కొనసాగుతుంది. ప్రజలు ఎవరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని.. లాక్ డౌన్ ను స్వచ్ఛందంగా పాటించడంతోపాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనాను కట్టడి చేయాలని హర్యానా ప్రభుత్వం ప్రజలకు సూచించిది. గతవారం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం వివాహాలు మరియు అంత్యక్రియలకు 11 మందికి పైగా వ్యక్తులకు అనుమతి లేదు.