లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఎస్సై.. ఆపై కరెన్సీ నోట్లు మింగి.. వీడియో

Haryana cop tries to swallow bribe money on being caught. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ బృందం

By అంజి  Published on  14 Dec 2022 4:02 AM GMT
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఎస్సై.. ఆపై కరెన్సీ నోట్లు మింగి.. వీడియో

హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో చేతిలో ఉన్న కరెన్సీ నోట్లను ఏం చేయాలో తెలియక.. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు వాటిని మింగేసే ప్రయత్నం చేశాడు. అతడు కరెన్సీ నోట్లను మింగుతున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది. గేదెల దొంగతనం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా సబ్ ఇన్‌స్పెక్టర్ మహేంద్ర పాల్ పట్టుబడ్డాడు.

గేదెల చోరీ కేసులో నిందితుడిని విచారించేందుకు ఆ పోలీసు అధికారి ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడు. గేదెను తీసుకెళ్లిన బాధితుడు శుభనాథ్ నుండి అధికారి రూ.10,000 డిమాండ్ చేశాడు. బాధితుడు అప్పటికే అధికారికి రూ.6,000 ఇచ్చాడు, అయితే మిగిలిన డబ్బు చెల్లించే ముందు శుభనాథ్ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. పోలీసు అధికారిని విజిలెన్స్ పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు, వారు ట్రాప్ ఏర్పాటు చేసి పట్టుకున్నారు.

విజిలెన్స్ బృందాన్ని గుర్తించిన సబ్ ఇన్‌స్పెక్టర్ డబ్బును మింగేందుకు ప్రయత్నించాడు. నోట్లను నోటిలో కుక్కేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎస్సై నోట్లో వేలు పెట్టి నోట్లు బయటకు లాగేందుకు ప్రయత్నించారు. అయితే అధికారులు బృందం పట్టుకుని అతడి చర్యను అడ్డుకుంది. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story