బహిరంగ సభ వేదికపై ప్రసంగిస్తూ కుప్పకూలిన సీఎం
Gujarat CM Vijay Rupani faints on stage during rally in Vadodara. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (64) అస్వస్థతకు గురయ్యారు.
By Medi Samrat Published on 15 Feb 2021 9:31 AM ISTగుజరాత్ సీఎం విజయ్ రూపానీ (64) అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సందర్భంలో ఆయన వేదికపై హఠాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన పాల్గొనబోయే ఇతర బహిరంగ సభలను రద్దు చేశారు. సీఎం కుప్పకూలిపోవడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వైద్య సిబ్బంది ప్రథమ చిక్సిత చేసిన అనంతరం వెంటనే అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. వడోదరలోని నిజాంపురలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
గుజరాత్‌లోని వడోదరతో సహా కీలకమైన ఆరుమునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు జరగనున్నాయి. మునిసి పాలిటీలు, జిల్లాలు, తాలూకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరుగుతాయి. ఈ నేఫథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా.. సీఎంకు కళ్లు తిరిగాయనీ.. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పడిపోకుండా పట్టుకున్నారనీ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్థానికబీజేపీ నాయకులు వెల్లడించారు.
Gujarat CM Vijay Rupani faints on stage during rally in Vadodara
— Prapti Buch (@p4prapti) February 14, 2021
Hope he is fine 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/MKpptkj36x
ప్రథమ చిక్సిత అనంతరం సీఎంను వడోదర నుంచి అహ్మదాబాద్‌కు హెలికాప్టర్‌లో తరలించామని.. కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుసగా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంతో రెండు రోజులుగా సీఎం ఆరోగ్యం దెబ్బతిందన్నారు. బీపీ, రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో నీరిసించి పోయారని వైద్యులు తెలిపారని చెప్పారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజయ్ రూపానీ ఆరోగ్యంపై ఆరా తీసారు.