బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగట్ హత్యకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం తెలిపారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వారు (నిందితులు) కస్టడీలో ఉన్నారు. వారు మాదకద్రవ్యాల వ్యాపారి కావచ్చు.. ఎవరైనా కావచ్చు, బిజెపి నాయకురాలు సోనాలి ఫోగట్ హత్యలో ప్రమేయం ఉన్నవారు శిక్షించబడతారని ఆయన అన్నారు.
గోవా పర్యాటక రాష్ట్రం. వివిధ రకాల పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వారిని 'అతిథి దేవో భవ'గా స్వాగతిస్తున్నాం. పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని ప్రమోద్ సావంత్ అన్నారు.
ఈ కేసుకు సంబంధించి గోవా పోలీసులు శనివారం ఉదయం డ్రగ్స్ పెడ్లర్ దత్తప్రసాద్ గాంకర్, రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు శుక్రవారం నాడు సుక్విందర్ సింగ్ అనే వ్యక్తితో పాటు సుధీర్ సాంగ్వాన్ (ఫోగట్ పీఏ)ని అరెస్ట్ చేశారు. సోనాలి ఫోగట్ ఆగస్టు 22న గోవాకు వచ్చి ఓ హోటల్‌లో ఉన్నారు.