భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు కోల్ కతా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే..! నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీని ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సందర్శించారు. మమతా బెనర్జీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకే వేదికపై కనిపించడం విశేషం. మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కూడా వారితో పాటు ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124వ జయంతి సందర్భంగా కోల్ కతాలోని విక్టోరియా మెమోరియల్ లో నిర్వహించిన కార్యక్రమానికి వీరు హాజరయ్యారు.
విక్టోరియా మెమోరియల్ లో కార్యక్రమం జరుగుతున్న వేళ, మమతా బెనర్జీ ప్రసంగించడానికి ముందు సభలోని కొందరు 'జై శ్రీరామ్', 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె, ఇదేమీ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమమని గుర్తు చేశారు. ఇక్కడ గౌరవంగా ఉండాలని సభకు హాజరైన వారికి హితవు పలికారు. తాను ప్రసంగించబోనని చెబుతూ, కార్యక్రమానికి హాజరైన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపి వేదికపై నుంచి వెళ్లిపోయారు. మమతా బెనర్జీ మాట్లాడడానికి ముందు సభలో నినాదాలు చేస్తున్న వారిని పదేపదే అధికారులు వారించారు. ఆమె కూడా సభికులు హుందాగా ప్రవర్తించాలని ఆమె సూచించారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని.. ఇది ప్రజల కార్యక్రమమని వ్యాఖ్యానించారు. ఈ సభలో మాట్లాడేందుకు మమతా బెనర్జీ నిరాకరిస్తూ.. జై హింద్ చెప్పేసి వెళ్లిపోయారు. ఇదే కార్యక్రమమేలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ సభలో భరతమాతను తలచుకోవడం కరెక్ట్ కానీ, శ్రీరాముడిని తలచుకునే సందర్భం ఇది కాదని అన్నారు.