గ్లోబల్ క్రూడ్ సప్లయ్ చైన్‌పై భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతరాయాలు ఏర్పడవచ్చని ప్రభుత్వ వర్గాలు గురువారం తెలిపాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. దీంతో భారత్‌లోని పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ప్రపంచ చమురు సంక్షోభం గురించి చమురు మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి కార్యాలయానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్లు వర్గాలు తెలిపాయి. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.. సంక్షోభం కారణంగా భారతీయ చమురు కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాల గురించి పీఎమ్‌ఓ, ఆర్థిక మంత్రిత్వ శాఖతో సవివరంగా చర్చించారు. చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు ప్రస్తుత ఎక్సైజ్ స్థాయిపై నిఘా ఉంచుతామని చెప్పారు. ముడిచమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది.
గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రకటించారు. యుద్ధం యొక్క ప్రకటన బ్రెంట్ ఇండెక్స్‌లో బ్యారెల్ చమురు ధరలను 100 డాలర్ల కంటే ఎక్కువ చేసింది. అంతేకాకుండా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 97.22 దగ్గర 5.50 శాతం పెరిగాయి. ముఖ్యంగా రష్యా ముడి చమురును ఉత్పత్తి చేసే దేశాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. రష్యాకు వ్యతిరేకంగా ఏదైనా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తే ముడి చమురు సరఫరాను రష్యా కఠినతరం చేయనుంది. ముఖ్యంగా ముడి చమురు ధరల పెరుగుదల దేశీయ ధరలను పెంచుతుంది, తద్వారా ద్రవ్యోల్బణాన్ని ప్రేరేపిస్తుంది.