మమతకు శుభాకాంక్షలతో పాటూ సలహా చెప్పిన గవర్నర్

Governor's wishes to Mamata Banerjee After Oath. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు.

By Medi Samrat
Published on : 5 May 2021 2:22 PM IST

Governor

ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆమెతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించగా బెంగాలీ భాషలో మమత సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా కారణంగా అతి తక్కువగా కేవలం 67 మంది అతిథులతో ఈ కార్యక్రమం కరిగింది.

అయితే ప్రమాణ స్వీకారం జరగగానే ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ్‌దీప్ ధ‌న్‌క‌ర్ ఆమెకు ఒక సూచన చేశారు. మూడోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసిన ఆమెను అభినందిస్తూనే.. రాష్ట్రంలో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌రిగిన హింస గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ్‌దీప్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అర్జెంటుగా సాధార‌ణ ప‌రిస్థితులు తీసుకురావ‌డానికి ముఖ్య‌మంత్రి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ఆశిస్తున్నాను. నా చెల్లెలు మ‌మ‌తా బెన‌ర్జీ ఆ ప‌ని చేస్తార‌న్న న‌మ్మ‌కం ఉందన్నారు జ‌గ్‌దీప్ ధ‌న్‌క‌ర్.

ప‌క్ష‌పాత ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న‌పెడ‌తార‌ని, పాల‌న‌లో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తార‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. బెంగాల్‌లో ఆదివారం ఎన్నిక‌ల ఫలితాలు వెలువ‌డిన తరువాత అక్కడ హింస చెల‌రేగింది. ప్ర‌తిప‌క్ష బీజేపీ ల‌క్ష్యంగా జరిగిన దాడులలో 12 మంది మృత్యువాత ప‌డ్డారు.



Next Story