పూణె నగరంలోని గూగుల్ కార్యాలయానికి సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే ఆ కాల్ బూటకమని పోలీసులు తెలిపారు. కాల్ చేసిన వ్యక్తిని హైదరాబాద్‌లో గుర్తించారు. సదరు వ్యక్తిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ముంబైకి తీసుకువెళ్లేందుకు ముంబై పోలీసుల బృందం తెలంగాణకు బయలుదేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్ చేసిన వ్యక్తికి పూణెలోని గూగుల్ ఆఫీస్‌లో బాంబ్ పెట్టినట్లు ముంబైలోని గూగుల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్‌కు ఫోన్ చేసి బెదిరింపు కాల్ చేశాడు.
కాల్ గురించి అప్రమత్తం కావడంతో, ముంబై పోలీసులు పూణేలోని తమ సహచరులతో కనెక్ట్ అయ్యారు, వారు పూణేలోని ముంధ్వా ప్రాంతంలోని బహుళ-అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్‌లో ఉన్న మల్టీ నేషన్ కంపెనీ కార్యాలయానికి చేరుకున్నారు. పుణె పోలీసులు, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ విస్తృతంగా సోదాలు నిర్వహించినా అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. కాల్ చేసిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన పనయం శివానంద్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
బెదిరింపు కాల్ రావడంతో, ముంబైలోని బీకేసీ పోలీస్ స్టేషన్‌లో గూగుల్ ఫిర్యాదు చేసింది. బీకేసీ పోలీసులు కాల్ చేసిన వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 505(1)(b), 506(2) కింద కేసు నమోదు చేసారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.