ఢిల్లీ నుండి నేపాల్ కు పోదామని అనుకున్న సైక్లిస్టులు.. దారి తప్పడంతో..

ఢిల్లీ నుంచి ఖాట్మండుకు సైకిల్‌పై వెళ్లాలని అనుకున్న ఇద్దరు ఫ్రెంచ్ పర్యాటకులు దారితప్పి యూపీలోని బరేలీకి చేరుకున్నారు.

By Medi Samrat  Published on  25 Jan 2025 6:30 PM IST
ఢిల్లీ నుండి నేపాల్ కు పోదామని అనుకున్న సైక్లిస్టులు.. దారి తప్పడంతో..

ఢిల్లీ నుంచి ఖాట్మండుకు సైకిల్‌పై వెళ్లాలని అనుకున్న ఇద్దరు ఫ్రెంచ్ పర్యాటకులు దారితప్పి యూపీలోని బరేలీకి చేరుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని ప్రయాణం సాగించిన సైక్లిస్టులు చురైలి డ్యామ్ సమీపంలోకి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. రాత్రి వేళల్లో సైకిల్‌పై వెళ్తున్న కొందరు గ్రామస్తులు గమనించి చురైలీ పోలీసు ఔట్‌పోస్టుకు తరలించారు. పోలీసులు సైక్లిస్టులకు గ్రామ ప్రధాన్ ఇంటి వద్ద రాత్రి సమయంలో విడిది ఏర్పాటు చేశారు.

ఫ్రెంచ్ పౌరులు బ్రియాన్ జాక్వెస్ గిల్బర్ట్, సెబాస్టియన్ ఫ్రాంకోయిస్ గాబ్రియేల్ జనవరి 7న విమానంలో ఫ్రాన్స్ నుండి ఢిల్లీకి వచ్చినట్లు బహేరీ సర్కిల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. పిలిభిత్ నుండి తనక్‌పూర్ మీదుగా నేపాల్‌లోని ఖాట్మండుకు వెళ్లవలసి ఉండగా.. చీకట్లో గూగుల్ మ్యాప్స్ ను అనుసరిస్తూ వెళ్లి దారి తప్పిపోయారు. యాప్ వారికి బరేలీలోని బహేరి ద్వారా షార్ట్‌కట్‌ను చూపించింది, దాని కారణంగా వారు దారితప్పి చురైలి డ్యామ్‌కు చేరుకున్నారని పోలీసులు తెలిపారు.

Next Story