ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ..భారత్‌లో ఏఐ విప్లవంపై కీలక చర్చలు!

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

By -  Knakam Karthik
Published on : 18 Feb 2026 4:31 PM IST

Sundar Pichai, PM Modi, Google CEO, AI Impact Summit 2026, New Delhi, India AI

ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ..భారత్‌లో ఏఐ విప్లవంపై కీలక చర్చలు!

న్యూఢిల్లీ: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న 'గ్లోబల్ AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన పిచాయ్, వచ్చిన వెంటనే ప్రధానిని కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి 20న జరిగే ఈ సమ్మిట్‌లో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు.

భారత్ పర్యటనపై స్పందించిన పిచాయ్.. "ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం మళ్ళీ భారతదేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి స్వాగతం, ఆతిథ్యం ఎప్పటిలాగే అద్భుతం" అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. దేశంలో కృత్రిమ మేధ (AI) విస్తరణ, గూగుల్ భవిష్యత్తు పెట్టుబడులపై ఈ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Next Story