రేషన్‌కార్డు దారులకు కేంద్రం గుడ్‌న్యూస్
రేషన్‌కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 12:02 PM GMTరేషన్‌కార్డు దారులకు కేంద్రం గుడ్‌న్యూస్
రేషన్‌కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఈ పథకాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర కేబినెట్ వెల్లడించింది. ఈ పథకం కింద రూ.81 కోట్ల మంది రేషన్‌కార్డు దారులకు మరో ఐదేళ్లపాటు ఉచితంగా రేషన్ అందనుంది. కాగా.. డిసెంబర్ 31తో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం ముగియాల్సి ఉండగా.. పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.
ప్రధాని నరేంద్ర ఇటీవల చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మాట్లాడిన ప్రధాని ఈ మేరకు పీఎంజీకేఏవై పథకంపై హామీ ఇచ్చారు. డిసెంబర్ 31తో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ముగియనుందని.. దాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తామని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ పథకానికి ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని కేంద్రం 2020 ఏప్రిల్‌లో ప్రారంభించింది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రజలందరికీ ఉచిత రేషన్‌ను మూడు నెలల పాటు అందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇదే పథకాన్ని కేంద్రం పొడగిస్తూ వచ్చింది. ఈ డిసెంబర్‌తో ముగియనుండా తాజాగా మరోసారి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని పెంచింది కేంద్ర ప్రభుత్వం.