Gold in borewell: బోరు బావి నుంచి బంగారాన్ని పోలిన పొడి.. నిజమైన బంగారమేనని

సాధారణంగా బోరు బావి నుంచి నీరు వస్తుంది. కానీ ఆ బోరు నుంచి నీరు కాకుండా బురదతో పాటు బంగారు

By అంజి  Published on  26 March 2023 4:03 AM GMT
Balangir, Odisha,Gold in borewell

Gold in borewell: బోరు బావి నుంచి బంగారాన్ని పోలిన పొడి.. నిజమైన బంగారమేనని

సాధారణంగా బోరు బావి నుంచి నీరు వస్తుంది. కానీ ఆ బోరు నుంచి నీరు కాకుండా బురదతో పాటు బంగారు రంగుతో కూడిన పొడి వస్తోంది. ఒడిశాలోని బొలంగీర్‌ జిల్లా చంచన బహాలి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన.. స్థానికంగా చాలా ఆసక్తిని రేకెత్తించింది. బోరు వేస్తే బంగారం పడిందంటూ పెద్దయెత్తున ప్రచారం సాగింది. విషయం తెలుసుకున్న అధికారులు బోరును సీజ్‌ చేశారు. బోరు నుంచి వెలువడిన మట్టి శాంపిల్స్‌ని సేకరించి ల్యాబ్‌కు టెస్టుల నిమిత్తం పంపించారు. గ్రామానికి చెందిన రైతు మహమ్మద్‌ జావెద్‌ తన పంట భూమిలో బోరు వేయించాడు.

అయితే రెండు రోజుల నుంచి బోరు నుంచి బంగారు రంగుతో కూడిన పొడి వస్తోంది. చూడటానికి అది అచ్చం బంగారంలనే ఉంది. ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. దీంతో బోరు నుంచి బంగారం వస్తుందనే వార్త ఆ ప్రాంతంలో ప్రచారమైంది. శనివారం తహసీల్దార్‌ ఆదిత్య మిశ్రాతో పాటు పలువురు అధికారులు మట్టి శాంపిల్స్‌ని సేకరించి అనంతరం బోరును సీజ్‌ చేశారు. సేకరించిన మట్టి శాంపిల్స్‌ని ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. టెస్ట్‌లు జరిగాక ఇది బంగారమా లేదా వేరే ఖనిజమా అనే విషయం తెలుస్తుందని తహసీల్దార్‌ తెలిపారు.

బొలంగీర్ జిల్లాలో గ్రాఫైట్, మాంగనీస్, విలువైన రాళ్లు తప్ప బంగారం నిల్వలు లేవని మైన్స్ అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చెబుతోంది.

Next Story