రూ.666 కోట్ల విలువైన బంగారంతో ట్రక్కు.. ఒక్కసారిగా యాక్సిడెంట్

తమిళనాడులోని ఈరోడ్‌లో రూ.666 కోట్ల విలువైన బంగారంతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 May 2024 10:45 AM IST
gold,  truck, accident,  tamil nadu,

రూ.666 కోట్ల విలువైన బంగారంతో ట్రక్కు.. ఒక్కసారిగా యాక్సిడెంట్

తమిళనాడులోని ఈరోడ్‌లో బుధవారం నాడు రూ.666 కోట్ల విలువైన బంగారంతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. కోయంబత్తూరు నుంచి సేలం వైపు 810 కిలోల బంగారు ఆభరణాలతో ట్రక్కు బయలుదేరింది. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. బంగారం తీసుకెళ్తున్న వాహనం అద్దాలపై మరో వాహనం నుంచి వచ్చిన టార్పాలిన్ పడింది. దీంతో ఏమి చేయాలో తెలియక డ్రైవర్ టెన్షన్ పడ్డాడు. దీంతో యాక్సిడెంట్ చోటు చేసుకుంది.

గాయాల పాలైన డ్రైవర్ శశికుమార్, సెక్యూరిటీ గార్డు పాల్‌రాజ్‌లను రక్షించి ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి మరో వాహనాన్ని పంపించి, బంగారాన్ని ఆ వాహనంలోకి మార్చారు. ఆ తర్వాత బంగారాన్ని గమ్యస్థానానికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

Next Story