ఇక‌పై అక్కడ మందు తాగితే రూ.10 వేలు ఫైన్..?

  • Goa To Impose Fine Of ₹ 10,000 For Drinking On Beaches. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిన విషయమే.అక్కడ మందు తాగితే రూ.10 వేలు ఫైన్

By Medi Samrat  Published on  9 Jan 2021 3:17 PM IST
Goa Beach

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిన విషయమే. మద్యం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. బహిరంగ ప్రదేశాలలో మద్యపానం పై నిషేధం విధించినప్పటికీ కొందరు వ్యక్తులు వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈ విధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల ప్రకృతి అందాలు దెబ్బతినే అవకాశం ఉందని భావించిన గోవా ప్రభుత్వం తాజాగా గోవా బీచ్ లో మద్యపానాన్ని నిషేధించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రకృతి అందాలకు నిలయమైన గోవా బీచ్ కు ఎంతో మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. అయితే నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి చాలా మంది పర్యాటకులు గోవాకు చేరుకొని, గోవా తీరంలో మద్యపానం తాగుతూ పెద్దమొత్తంలో బాటిళ్లను పడేసారు. దీని వల్ల ప్రకృతి అందాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన గోవా పర్యాటక శాఖ అధికారులు బీచ్ లో మద్యం తాగితే 10 వేల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

బీచ్ లలో మద్యం నిషేధమని బోర్డులను ఏర్పాటు చేసినట్లు పర్యాటక శాఖ డైరెక్టర్‌ మెనినో డిసౌజా తెలిపారు. ఈ సందర్భంగా బీచ్ లో మద్యం తాగుతూ కనిపిస్తే రెండు వేల రూపాయలు జరిమానా, వ్యక్తులు సమూహంగా, గుంపులుగా కలిసి మద్యపానం చేస్తే 10 వేలరూపాయలు జరిమానా విధించేలా 2019 జనవరిలోనే పర్యాటక వాణిజ్య చట్టాన్ని సవరణ చేసినట్లు పర్యాటక శాఖ డైరెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సవరించిన చట్టాన్ని ప్రస్తుతం పోలీసుల ద్వారా అమలు చేయనున్నట్లు పర్యాటక శాఖ తెలియజేసింది.ఈ ఆదేశాల ద్వారా మందుబాబులు గోవా బీచ్ లో మద్యం సేవిస్తున్న కనిపిస్తే ఇక వారి జేబులకు చిల్లుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.




Next Story