Glider crash : డేంజర్ రైడ్.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం
ఓ చిన్నపాటి విమానం అదుపు తప్పి ఇంట్లోకి దూసుకువెళ్లింది.పైలట్‌తో పాటు 14 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
By తోట వంశీ కుమార్ Published on 24 March 2023 3:50 AM GMTఇంట్లోకి దూసుకెళ్లిన విమానం
ఓ చిన్నపాటి విమానం అదుపు తప్పి ఇంట్లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో పైలట్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న 14 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని పట్నాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ధన్‌బాద్‌లోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ధన్‌బాద్ సిటీ అందాలను వీక్షించాలని అనుకున్నాడు. ఓ ప్రైవేటు గ్లైడర్ ప్లేన్ రైండింగ్ అందుబాటులో ఉండడంతో దానిలో ఎక్కాడు. ఆ తేలికపాటి విమానం ధన్‌బాద్‌లోని బర్వాడ్డ ఏర్‌స్ట్రిప్ నుంచి బయలుదేరింది. ఎయిర్‌పోర్టుకు 500 మీటర్ల దూరం వెళ్లగానే అదుపు తప్పి నీలేష్‌కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి దూసుకువెళ్లింది.
Live Plane Crash#accident #planecrash #Aircraftcrash #dhanbad pic.twitter.com/4NjrSU27uZ
— Chiranjivi Singh🇮🇳 (@chiranjivi470) March 23, 2023
విమానం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడికి, ఫైలట్‌కి తీవ్రంగా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా.. ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయాన్ని ఇంటి యజమాని నీలేశ్‌కుమార్ తెలిపారు. తమ పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్నారని, ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారన్నారు. సాంకేతిక కారణంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు బావిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ తరువాతే అసలు విషయాలు తెలుస్తాయన్నారు.