చెవి నొప్పితో ఆస్పత్రికి యువతి.. చేయి తొలగించిన వైద్యులు

Girl had to get her hand cut due to carelessness of the hospital in Patna. చెవి నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లిన యువతికి వైద్యులు సర్జరీ చేశారు. ఆ తర్వాత ఓ ఇంజెక్షన్‌ ఇచ్చి పంపించారు.

By అంజి  Published on  1 Sep 2022 12:25 PM GMT
చెవి నొప్పితో ఆస్పత్రికి యువతి.. చేయి తొలగించిన వైద్యులు

చెవి నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లిన యువతికి వైద్యులు సర్జరీ చేశారు. ఆ తర్వాత ఓ ఇంజెక్షన్‌ ఇచ్చి పంపించారు. అప్పటి నుంచి చేయి నొప్పి పెడుతోందని యువతి వైద్యులకు చెప్పింది. అయితే వైద్యులు మాత్రం నిర్లక్ష్యం చేశారు. దీని కారణంగా ఆమె తన ఎడమ చేయిని మోచేతి వరకు కోల్పోయింది. ఎడమ చేయిని తొలగించి ఆమెను వైద్యులు కాపాడారు. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శివహర్​ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవి నొప్పితో పాట్నాలోని మహావీర్​ ఆరోగ్య సంస్థాన్ ఆస్పత్రికి వెళ్లింది.

యువతిని పరీక్షించిన వైద్యులు.. సర్జరీ అవసరమని చెప్పారు. జులై 11న సర్జరీ చేసి మందులు రాశారు. ఆ తర్వాత వైద్యులు చెప్పిన ఇంజక్షన్​ను యువతికి నర్సు ఇచ్చింది​. సర్జరీ తర్వాత ఇంటికి వెళ్లిన రేఖకు ఎడమ చేయి నొప్పి పెట్టడంతో పాటు, రంగు మారడం మొదలైంది. దీంతో వెంటనే రేఖ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రందించింది. అయితే వారు మాత్రం కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందని పంపించేశారు. ఆ తర్వాత కూడా రేఖ చేయి నొప్పి తగ్గలేదు. దీంతో ఆ యువతి చికిత్స అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగింది రేఖ.

తిరిగి తిరిగి ఢిల్లీలోని ఎయిమ్స్​ వెళ్లింది. అక్కడకు వెళ్లినా రేఖ చేయి నొప్పి తగ్గలేదు. నొప్పి తీవ్రం కావడం వల్ల చివరగా పాట్నాలోని మేదాంత ఆస్పత్రిలో చేరింది. ఆగస్టు 4న యువతికి సర్జరీ చేసిన వైద్యులు.. ఆమె ఎడమ చేయిని మోచేతి వరకు తొలగించారు. అనంతరం 15 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షించారు. రేఖకు నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఇలా కావడంతో వరుడి కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకుని వెళ్లిపోయారు. చేయిని తొలగించడం తన సోదరి రేఖ తీవ్ర మనస్తాపానికి గురైందని రోషికి ఆవేదన వ్యక్తం చేశారు.

దీనంతటికి కారణమైన మహావీర్ సంస్థాన్​ ఆస్పత్రి గుర్తింపును రద్దు చేయాలని ఆమె డిమాండ్‌ చేసింది. ఆస్పత్రి వాళ్లు అప్పుడే పట్టించుకుంటే తన సోదరి చేయి తొలగించేవారు కాదని రేఖ సోదరి రోషిని చెప్పింది. ఈ ఘటనపై మహావీర్‌ ఆరోగ్య సంస్థాన్‌ ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. రేఖ అవయ మార్పిడికి అవసరమైన ఏర్పాట్లను ఢిల్లీలోని మాక్స్‌ ఆస్పత్రిలో పూర్తి చేశామని చెప్పింది. దీనిపై యువతి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇచ్చామని పేర్కొంది. త్వరలోనే అవయవ మార్పిడి సర్జరీ పూర్తి చేయిస్తామని వెల్లడించింది.

Next Story