కోటి రూపాయలు విరాళం ప్రకటించిన గంభీర్..!

Gautam Gambhir Contributes One Crore For Ram Temple Construction. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన గంభీర్.

By Medi Samrat  Published on  22 Jan 2021 2:17 AM GMT
BJP MP Gautam Gambhir

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాల కార్యక్రమం మొదలైంది. రామ మందిరం నిర్మాణానికి మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ భారీ విరాళం ప్రకటించారు. తాను రామ మందిర నిర్మాణానికి కోటి రూపాయలు ఇస్తున్నానని ప్రకటించారు. అద్భుతమైన రామ మందిర నిర్మాణం అనేది భారతీయుల అందరి కల. ఎట్టకేలకు అది నెరవేరబోతోంది. ప్రశాంతత, ఐకమత్యానికి ఇది బాటలు వేస్తుంది. ఈ నేపథ్యంలో నా వంతుగా నా కుటుంబం తరఫున చిన్న విరాళం అని గౌతం గంభీర్‌ ప్రకటన విడుదల చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో నిర్మించనున్న రామమందిర నిర్మాణానికై రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ విరాళాలను సేకరిస్తోంది. పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విరాళాలను అందిస్తూ ఉన్నారు.

వందల ఏళ్ల నుంచి హిందూ జాతి మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న కల అయోధ్య రామ మందిర నిర్మాణం. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో హిందువులంతా భాగం పంచుకోవాలనే సదుద్దేశంతో 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు' దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగ నుంచి వచ్చే మాఘ పూర్ణిమ వరకు విరాళాల సేకరణ మొదలు పెట్టింది.

తెలంగాణలో జనవరి నెల 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ఢిల్లీ బీజేపీ సైతం రూ. 10, 100, 1000 కూపన్ల రూపంలో విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది. అదే విధంగా వెయ్యి రూపాయలకు పైగా డొనేషన్‌ ఇవ్వాలనుకునే వారు చెక్కుల రూపంలో అందజేయవచ్చని తెలిపింది.

2021 నవంబర్ 9న కేంద్ర ప్రభుత్వం అయోధ్య రామాలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ప్రస్తుతం విరాళాలు సేకరిస్తోంది. జనవరి 15న విశ్వహిందు పరిషత్ (VHP) సారధ్యంలో ఓ బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ని కలిసి విరాళం కోరింది. ఆయన తన వ్యక్తిగత ఆదాయం నుంచి రూ.5,00,100 విరాళం ఇచ్చారు.
Next Story
Share it