బొమ్మలకు అంత్యక్రియలు
Funeral For Uttarakhand Mishap Dead Bodies. ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న జలప్రళయం ఘటనలో సహాయక చర్యలు ఇంకా
By Medi Samrat Published on 16 Feb 2021 6:00 PM IST
ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న జలప్రళయం ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రంగంలోకి దిగిన ప్రత్యేక సహాయక బృందాలు చర్యలు ముమ్మరం చేశాయి. మంగళవారం ఉదయం మరో రెండు మృతదేహాలు లభించాయి. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 58కి చేరింది. వీరిలో 29 మందిని గుర్తించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా, మరో 146 మంది ఆచూకీ లభించాల్సి ఉందని తెలిపారు. తపోవన్ ప్రాంతంలోని 1.7 కిలోమీటర్ల పొడవున్న ఎన్టీపీసీ హైడ్రోపవర్ ప్రాజెక్టు సొరంగంలో ఇప్పటి వరకూ 11 మంది మృతదేహాలను వెలికి తీశారు. సొరంగంలో భారీగా పేరుకుపోయిన బురద వల్ల గాలింపు చర్యలుకు ఆటంకం ఏర్పడుతోంది. అయితే ఇప్పటి వరకు 146 మీటర్ల మేరకు బురదను తొలగించినట్లు అధికారులు తెలిపారు.
బొమ్మలకు అంత్యక్రియలు
కాగా, ఈ ఘటన జరిగి పది రోజులు అవుతున్నా.. గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో వారు తిరిగి వస్తారనే ఆశలు కూడా వదలుకున్నారు కుటుంబ సభ్యులు. ఇక వారి మృతదేహాలు లభించే అవకాశాలు తక్కువగా ఉండటంతో బొమ్మలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి జౌన్సారి తెగల సంప్రదాయం ప్రకారం మృతి చెందిన వారికి 14 రోజుల్లోగా అంత్యక్రియలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గల్లంతైన వారి మృతదేహాలు లభించకపోవడంతో వారి ఆకృతితో ఉన్న బొమ్మలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Next Story