కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Full DA, DR benefits coming on July 1 for Central govt employees. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్‌ అలవెన్స్‌ (DA) బెనిఫిట్స్‌ జూన్‌ తర్వాతే పొందనున్నారు.

By Medi Samrat  Published on  19 March 2021 3:15 AM GMT
Full DA, DR benefits coming on July 1 for Central govt employees

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్‌ అలవెన్స్‌ (DA) బెనిఫిట్స్‌ జూన్‌ తర్వాతే పొందనున్నారు. పెన్షనర్లు సైతం తమ బకాయిల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో 7వ వేతన సంఘం ఈ కీలక ప్రతిపాదనలు చేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఇటీవల పార్లమెంట్‌లో ప్రస్తావించారు. జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డీఏ బెనిఫిట్స్‌ పొందనున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్(DA), డీఆర్ మూడు వాయిదాలు బకాయి ఉంది. వారికి గత ఏడాది నుంచి చెల్లించలేదు. జనవరి 1, 2020 నుంచి మూడు దఫాలుగా చెల్లించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న డీఆర్‌, డీఏలను జూలై 1, 2021 నుంచి చెల్లించనున్నారు. 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల పెన్షనర్లకు కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా డీఏ, డీఆర్‌లను కేంద్ర ప్రభుత్వ చెల్లించడం లేదు. వారికి ఉద్యోగులకు అందలేదు.

కాగా, గత ఏడాది కేంద్రం సర్కారు ఉద్యోగులకు 4 శాతం డీఏను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దాంతో వారికి కొత్త డీఏ ప్రకారం..మొత్తం 21శాతం రానుంది. బకాయిపడ్డ డీఏలను సైతం పెంచితే వారికి ఏకంగా 28శాతం డీఏ రానుంది.


Next Story
Share it