పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉండడానికి కారణం చెప్పిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Fuel prices may fall by April, says petroleum minister Dharmendra Pradhan. భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడానికి కారణం చెప్పిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

By Medi Samrat
Published on : 28 Feb 2021 5:49 PM IST

minister Dharmendra Pradhan

భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! 100 రూపాయలను దాటేశాయి. రోజు రోజుకీ మరింతగా పెరుగుతూ వెళుతుంటే ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. తాజాగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు పెరగడానికి కారణం తెలిపారు. పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ స్పందిస్తూ వాటి ధ‌ర‌లు ఎప్పుడు త‌గ్గుతాయో క‌చ్చితంగా చెప్ప‌లేమ‌ని తెలిపారు.

వ‌చ్చే నెల లేదా ఏప్రిల్‌లో త‌గ్గే అవకాశం ఉన్న‌ట్లు చెప్పారు. ముడి చ‌మురు ఉత్ప‌త్తి చేసే దేశాలు ఉద్దేశ‌పూర్వ‌కంగా ఉత్ప‌త్తిని త‌గ్గించ‌డం వ‌ల్లే మ‌న దేశంలో ధ‌ర‌లు పెరుగుతున్న‌ట్లు తెలిపారు. వాటి ఉత్ప‌త్తిని పెంచాల‌ని ర‌ష్యా, ఖ‌తార్‌, కువైట్ ‌లాంటి దేశాల‌పై తాను ఒత్తిడి తెస్తున్న‌ట్లు చెప్పారు. ఒక‌వేళ ఉత్ప‌త్తి పెరిగితే బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర త‌గ్గుతుంద‌ని ఆయ‌న అన్నారు. అలా ఆయా దేశాలు చేస్తే భారతదేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. గ‌త ఏడాది ఏప్రిల్‌లో ఆయా దేశాలు ఉత్ప‌త్తిని త‌గ్గించాయని, ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డంతో డిమాండ్ పెరిగినప్ప‌టికీ ఆ దేశాలు ఉత్ప‌త్తిని పెంచ‌‌డం లేదని తెలిపారు. అదే భారత్ లో పెట్రోల్-డీజిల్ ధరలు పెరగడానికి కారణమవుతోందని చెప్పుకొచ్చారు.


Next Story