Fuel Prices In India. మే 4 నుండి మొదలైన పెట్రో వడ్డన రోజురోజుకు ముందుకు సాగుతూనేవుంది. దీంతో దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది.
By Medi Samrat Published on 13 May 2021 4:53 AM GMT
కరోనా నుండి సామాన్యుడు కోలుకోవట్లేదు. పెరుగుతున్న ధరలతో బతుకు భారంగా మారగా, భవిష్యత్తూ అంధకారంలోకి మారనుంది. చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కూడా అమల్లో ఉంది. అయినా.. దేశంలో పెట్రోల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేఫథ్యంలో కొన్ని రోజులుగా పెరగని ఆయిల్ ధరలు.. ఎన్నికల తర్వాత రోజువారీగా ప్రజల నెత్తిన భారాన్ని మోపుతున్నాయి. మే 4 నుండి మొదలైన పెట్రో వడ్డన రోజురోజుకు ముందుకు సాగుతూనేవుంది. దీంతో దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది.
నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని బోఫాల్‌లో లీటరు పెట్రోల్ రూ.100.08 ఉండగా.. ఇండోర్‌లో రూ.100.16, నగరాబంధ్‌లో లీటర్ పెట్రోల్ 103 రూపాయలకు చేరింది. ఇక రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌లో దేశంలోనే ఎక్కడా లేనంత అధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.102.96కు చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.95.89గా ఉంది. మహారాష్ట్రలోని పర్భణీలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.73 పైసలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 95.67, డీజిల్ ధర రూ. 90.06గా ఉంది.