దేశంలో మళ్లీ శుక్రవారం పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 30 పైసల చొప్పున పెరిగింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం పెట్రోల్ లీటరు ధర రూ. 86.65 ఉండగా శుక్రవారం నాటికి రూ. 86.95 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర రూ.76.83 నుంచి రూ.77.13కి పెరిగింది. ముంబై నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ. 93.49 రూపాయలకు పెరిగింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 89.39కి పెరిగింది.
కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. జనవరి 6వ తేదీ నుంచి భారత ఆయిల్ కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పెట్రోలు లీటరు ధర రూ. 84.14, బెంగళూరులో రూ. 81.76, బెంగళూరులో రూ. 89.85కి పెరిగింది. ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.