పెట్రోల్-డీజిల్ ధరల విషయంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పెట్రో ధరలపై భారీ ఊరట ఇచ్చే ప్రకటన చేసింది. ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు శనివారం సాయంత్రం వెల్లడించింది. పెట్రోల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ 8 రూపాయలు, డీజిల్ పై రూ. 6 తగ్గిస్తున్నట్లు తెలిపింది. తద్వారా పెట్రోల్ పై లీటర్‌కు రూ. 9.5, డీజిల్‌పై రూ.7 తగ్గుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు తీపికబురు తెలిపింది. గ్యాస్ సిలిండర్‌పై ₹200 రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. అలాగే చమురుపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.