దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. వరుసగా చమురు సంస్థలు ధరలు పెంచడంతో వాహనదారులకు భారంగా మారుతోంది. అయితే ఎన్నికల ముందు నాలుగు రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తాము విధించే ట్యాక్స్‌ను తగ్గించాలనుకుంటోందట. మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రతిపక్షాలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. అయితే దేశంలో పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.
ఇదే క్రమంలో పబ్లిక్ సెక్టార్ ఫ్యూయెల్ అమ్మకందారులు కూడా ధరలు తగ్గించాలని అనుకుంటున్నారు. బ్రెంట్ క్రూట్ బ్యారెల్‌కూ 70 డాలర్ల కంటే ఎక్కువ ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం గమర్హం. ప్రస్తుతం ఓ 9 రోజుల నుంచి ధరలలో మార్పులు కనపించడం లేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోనే అధిక ధరలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా డీజిల్ ధర లీటర్‌కు రూ.80కు పెరగడంతో ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జీలు అమాంతంగా పెంచేశారు. రాష్ట్రానికి, కేంద్రానికి పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్స్‌లు విధించం ముఖ్యమైన ఆర్థిక వనరు. కోవడ్-19 తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ తీసుకురావడం అనేది తప్పనిసరి అయిపోయింది. ఒకవేళ ఇంధన ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకుంటే అత్యధిక పన్ను కింద సంవత్సరానికి రూ.2.5 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది.