పెట్రోల్, డీజిల్ ధరలు రానున్న రోజుల్లో పెరుగుతాయనే పుకార్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రస్తుతం ప్రభావం ఉండబోదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా చమురు ధరలను స్థిరంగా ఉంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇంధన సరఫరాలోనూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా ‘ఫ్యూయల్ సప్లై మేనేజ్‌మెంట్ చైన్’ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ఇప్పటికే యాక్టివేట్ చేసింది. హార్ముజ్ మార్గం కాకుండా ఇతర ప్రాంతాల నుంచి చమురు దిగుమతులను 60 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దాదాపు 40 దేశాల నుంచి భారత్ చమురును సేకరిస్తోంది. ఈ కొత్త మార్గం ద్వారా చమురు దిగుమతి చేసుకోవడంతో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ సంక్షోభం లేదని తెలుస్తోంది.