గుడ్లు తింటున్నారా?..FSSAI కీలక హెచ్చరిక

గుడ్లు తినే వారికి భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ (FSSAI) బిగ్ అలర్ట్ ఇచ్చింది.

By -  Knakam Karthik
Published on : 16 Dec 2025 10:46 AM IST

National News, FSSAI,  egg safety drive, nitrofurans

గుడ్లు తింటున్నారా?..FSSAI కీలక హెచ్చరిక

గుడ్లు తినే వారికి భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ (FSSAI) బిగ్ అలర్ట్ ఇచ్చింది. గుడ్లలో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత కెమికల్ ఉందో లేదో తనిఖీ చేయడానికి దేశవ్యాప్తంగా శాంపిల్స్ సేకరించాలని FSSAI ఆదేశాలు జారీ చేసింది.

మార్కెట్లో అమ్ముడవుతున్న కొన్ని గుడ్లలో నిషేధిత యాంటీబయాటిక్ నైట్రోఫ్యూరాన్ గ్రూపుకు చెందిన ఔషధాల అవశేషాలు కనిపించాయని ఇంటర్నెట్ మీడియాలో ఒక నివేదిక, వీడియో వైరల్ అయిన తర్వాత FSSAI ఈ చర్య తీసుకుంది.

నైట్రోఫ్యూరాన్లు అనేవి యాంటీబయాటిక్స్ సమూహం, వీటిని భారతదేశంతో సహా అనేక దేశాలలో ఆహార ఉత్పత్తి చేసే జంతువులు, కోళ్లలో పూర్తిగా నిషేధించారు. ఈ ఔషధాల అవశేషాలు గుడ్లు, శరీరంలో చాలా కాలం పాటు ఉంటాయి, దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉంటుంది.

అయితే, కోళ్లలో యాంటీబయాటిక్ దుర్వినియోగం అనే విస్తృత సమస్య ప్రజారోగ్యానికి తీవ్రమైన సమస్యగా మిగిలిపోయిందని వైద్య నిపుణులు అంటున్నారు. సర్ గంగా రామ్ హాస్పిటల్‌లోని సర్జికల్ ఆంకాలజీ చైర్మన్ ప్రొఫెసర్ చింతామణి మాట్లాడుతూ, నైట్రోఫ్యూరాన్‌లను ప్రపంచవ్యాప్తంగా నిషేధించారని, ఎందుకంటే వాటి అవశేషాలు గుడ్లలో ఉడికించిన తర్వాత కూడా ఉంటాయి. కలుషితమైన గుడ్లను దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల జన్యుపరమైన నష్టం మరియు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని, కాలేయం మరియు మూత్రపిండాలకు హాని కలుగుతుందని జంతు అధ్యయనాలలో తేలింది.

Next Story