అధికారంలోకి వస్తే గ్రాడ్యుయేట్‌లకు నెలకు రూ.3 వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.1,500

Free electricity, monthly allowances for graduates. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌లకు రెండేళ్లపాటు నెలకు

By Medi Samrat  Published on  20 March 2023 2:20 PM GMT
అధికారంలోకి వస్తే గ్రాడ్యుయేట్‌లకు నెలకు రూ.3 వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.1,500

Rahul Gandhi


వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌లకు రెండేళ్లపాటు నెలకు రూ.3,000, డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామని రాహుల్‌గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ సోమవారం ఉద్యోగాల విషయంలో అధికార‌ బీజేపీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలు, కాంట్రాక్టర్ల నుండి ప్రభుత్వం 40 శాతం కమీషన్ వసూలు చేస్తుందని ఆరోపించారు. 'భారత్ జోడో యాత్రలో యువకులు నా వద్దకు వచ్చి ఈ రాష్ట్రంలో తమకు ఉద్యోగాలు లేవని చెప్పారు' అని రాహుల్ గాంధీ అన్నారు.

“కాంగ్రెస్ ప్రతి గ్రాడ్యుయేట్‌కు రెండేళ్లపాటు ప్రతినెలా రూ.3,000, డిప్లొమా హోల్డర్లకు రెండేళ్లపాటు రూ.1,500 ఇస్తుంది. మేము అక్కడ ఆగము. ఐదేళ్లలో 10 లక్షల మంది యువతీ, యువకులకు ఉద్యోగాలు ఇస్తామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. భారత్ జోడో యాత్రలో మహిళలు కూడా తమ సమస్యలను చెప్పుకున్నారు. మహిళలకు నెలకు రూ.2వేలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యం, 2వేల యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందజేస్తామ‌ని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భారత్ జోడో యాత్రలో అందరూ కలిసి నడిచారని, ద్వేషం, హింసకు తావులేదని రాహుల్ గాంధీ అన్నారు. “దేశం ఎంపిక చేసిన కొందరికే కాదు.. అందరికీ చెందినది. ఇది అదానీకి చెందినది కాదు. ఇది రైతులు, కార్మికులు, యువకులు, పేదలకు చెందినదని రాహుల్ గాంధీ అన్నారు.

రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. “మేము ఎన్నికల్లో పోరాడతాం. రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేస్తాం. ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించాలని కోరుకుంటున్నారు. కలిసికట్టుగా బీజేపీని ఓడిస్తామ‌ని రాహుల్ గాంధీ అన్నారు.


Next Story