జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
Four terrorists neutralised in Jammu and Kashmir's Kupwara.జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది.
By తోట వంశీ కుమార్
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుప్పారాలోని లోబాల్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
#KupwaraEncounterUpdate: 02 more #terrorists including #terrorist Showkat got #neutralised (total 04). #Incriminating materials, arms & ammunition recovered. Search going on. Further details shall follow.@JmuKmrPolice https://t.co/uI25QVRlJY
— Kashmir Zone Police (@KashmirPolice) June 20, 2022
కుప్పారాలోని లోబాల్ ప్రాంతంలో ఉగ్రవాది షౌకత్ అహ్మద్ షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చేపట్టగా.. ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అందులో ఇద్దరిని కుల్గామ్‌కు చెందిన జాకీర్ పదార్, శ్రీనగర్‌కు చెందిన షరీఫ్‌గా గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో గత 24 గంటల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక 2022లో ఇప్పటి వరకు 32 మంది పాకిస్థానీలతో సహా 110 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.