విషాదం.. కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌ రామ్‌ కన్నుమూత

Former Union minister Pandit Sukh Ram passes away.కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది.కేంద్ర మాజీ మంత్రి,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2022 4:11 AM GMT
విషాదం.. కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌ రామ్‌ కన్నుమూత

కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది.కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత పండిట్ సుఖ్ రామ్ క‌న్నుమూశారు. ఈ నెల 4వ తేదీన పండిట్ సుఖ్ రామ్ కు బ్రెయిన్ స్ట్రోక్ రావ‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని మండి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన వైద్యం కోసం ఆయ‌న్నుఎయిర్ అంబులెన్స్‌లో న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 94 సంవ‌త్స‌రాలు. పండిట్‌ సుఖ్‌ రామ్‌ మనవడు ఆశ్రయ్‌ శర్మ సోషల్‌ మీడియా వేదికగా ఈ విషాద వార్తను తెలియ‌జేశాడు.

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్‌సభ స్థానం నుంచి సుఖ్‌రామ్‌ మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1993 నుంచి 1996 మధ్యకాలంలో కేంద్ర ప్రసారాల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1963 నుంచి 1984 వరకు మండి ఎమ్మెల్యేగా ఐదుసార్లు విజ‌యం సాధించారు. రాష్ట్ర పశుసంవర్ధక మంత్రిగా పనిచేశారు. ఆ స‌మ‌యంలో జ‌ర్మ‌నీ నుంచి ఆవుల‌ను తీసుకువ‌చ్చారు. ఇది రాష్ట్ర రైతుల ఆదాయాన్ని పెంచ‌డానికి దారి తీసింది. 1984లో మొదటిసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో జూనియర్‌ మంత్రిగా పనిచేశారు. ఆ స‌మ‌యంలో సుఖ్ రామ్ రక్షణ ఉత్పత్తి, సరఫరాలు, ప్రణాళిక, ఆహారం, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

Next Story