మాటలు తక్కువ.. పని ఎక్కువ.. కీలక సంస్కరణలకు పునాది వేసిన మన్మోహన్
ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్‌కు రాజకీయాలు పరిచయం చేసింది పీవీ నరసింహారావు అనే చెప్పాలి.
By అంజి Published on 27 Dec 2024 6:51 AM ISTమాటలు తక్కువ.. పని ఎక్కువ.. కీలక సంస్కరణలకు పునాది వేసిన మన్మోహన్
ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్‌కు రాజకీయాలు పరిచయం చేసింది పీవీ నరసింహారావు అనే చెప్పాలి. 1991లో దుర్భర ఆర్థిక పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి సింగ్‌ను రాజ్యసభకు పంపి ఆర్థిక మంత్రిని చేశారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా నాటి సంస్కరణలు నేటికీ చిరస్థాయిగా నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలకు పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను ప్రధానిగా ఆయన కొనసాగించారు.
తద్వారా విదేశీ పెట్టుబడులు, ప్రైవేటీకరణ, లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికాతో అణు ఒప్పందం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణకు పునాది వేశారు. మన్మోహన్ సింగ్ పేరు చెప్పగానే.. ఆయన అసలేం మాట్లాడరు అని అంతా అంటుంటారు. అది నిజమే.. కానీ చాలా మంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో పని చూపించే నేత. 1991 నుంచి 1996 వరకు దేశ ఫైనాన్స్ మినిస్టర్‌గా పని చేసిన మన్మోహన్.. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఆయన హయాంలోనే అత్యధిక జీడీపీ 10.2 శాతం వృద్ధిరేటు నమోదు అయ్యింది. వెనుకబడిన వర్గాలకు 27 శాతం సీట్ల కేటాయింపు జరిగింది.