హీరో నిఖిల్ గౌడ ఓటమి

Former CM HD Kumaraswamy's son Nikhil Kumaraswamy loses. కర్ణాటక ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటమి పాలయ్యారు.

By Medi Samrat
Published on : 13 May 2023 2:26 PM IST

హీరో నిఖిల్ గౌడ ఓటమి

కర్ణాటక ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటమి పాలయ్యారు. ఆ లిస్టులో తెలుగు ప్రజలకు తెలిసిన నిఖిల్ గౌడ కూడా ఉన్నారు. జాగ్వార్ సినిమా ద్వారా నిఖిల్ గౌడ తెలుగులో కూడా బాగా ఫేమస్. మాజీ పీఎం HD దేవెగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి కొడుకు హీరో నిఖిల్ గౌడ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. రామ‌న‌గ‌ర నుంచి పోటీ చేసిన నిఖిల్ కుమార గౌడ కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయాడు. రామనగరం స్థానం నుంచి నిఖిల్ గౌడ (జేడీఎస్) ఇక్బాల్ హుస్సేన్ (కాంగ్రెస్) మరిలింగగౌడ (బీజేపీ) తో పోటీపడ్డారు. ఈ త్రిముఖపోటీలో కాంగ్రెస్ అభ్యర్ధికి విజయం దక్కింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్‌పై జేడీ(ఎస్) అభ్యర్థి కుమారస్వామి విజయం సాధించడం విశేషం. రామ‌న‌గ‌ర అసెంబ్లీ స్థానంలో జేడీఎస్‌కి మంచి పట్టు ఉండడంతో కుమారస్వామి తన కొడుకు నిఖిల్ గౌడను దింపాడు. కానీ నిఖిల్ విజయాన్ని అందుకోలేకపోయాడు.


Next Story